కుంటాల, వెలుగు : కుంటాల పొలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా భాస్కరా చారి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన రజినీకాంత్ బదిలీపై నిజామాబాద్ జిల్లా ముప్కల్ కు వెళ్లారు. అక్కడ పనిచేసిన భాస్కరా చారి ఇక్కడికి వచ్చారు.
కొత్త ఎస్ ఐకి సిబ్బంది స్వాగతం పలికారు. అందరి సహకారంతో మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేస్తానని ఆయన తెలిపారు.