గ్లోబల్ బేవరేజ్ లీడర్ కోకాకోలా భారత్ తన వ్యాపార కార్యకలాపాలను క్రమంగా తగ్గించుకుంటోంది. ఇందులో భాగంగా హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో 40 శాతం వాటాను జూబిలెంట భార్టియా గ్రూప్ కు విక్రయించింది. దీంతో భారత్ లో బేవరేజెస్ వ్యాపారంలో జూబిలెంట్ భార్టియా గ్రూప్ ప్రాధాన్యత పెరుగుతోంది.
జూబిలెంట్ భార్టియా గ్రూప్‌కు చెందిన భారతీయ కుటుంబం.. కోకా-కోలా ఇండియా కు చెందిన హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ (HCCB)లో 40శాతం వాటాను రూ. 12వేల500 కోట్లకు కొనుగోలు చేసింది.
కూల్ డ్రింక్స్, జ్యూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్‌తో సహా 8విభాగాల్లో మొత్తం 37 ఉత్పత్తులను కోకాకోలా ఇండియా కంపెనీ తయారు చేస్తోంది. హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్, కోకా-కోలా ఇండియాకు ఇదే ప్రధానం ఆదాయం తెచ్చిపెట్టే విభాగం.