గడ్డెన్నగేట్లు ఎత్తివేత

భైంసా, వెలుగు : ఎగువ మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు భైంసా గడ్డెన్న ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 358.70 మీటర్లు కాగా.. ప్రస్తుతం 358.30 మీటర్లు ఉంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షంతో ప్రాజెక్టులోకి 20330 క్యూసెక్కుల నీరు ఇన్​ఫ్లో ఉండగా.. అధికారులు మూడు గేట్లు ఎత్తి 27695 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. సాయంత్రం ఇన్​ఫ్లో తగ్గడంతో గేట్లు మూసివేశారు.