క్రెడిట్ కార్డు హోల్డర్లకు సుప్రీంకోర్టు షాక్..వడ్డీరేట్లపై చేదువార్త

క్రెడిట్ కార్డు హోల్డర్లకు ఇది నిజంగానే చేదువార్త.. క్రెడిట్ కార్డు వడ్డీ రేట్లను ఏటా 30 శాతం పరిమితిని ఎత్తివేస్తూ సుప్రీకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో బ్యాంకులు అధిక ఛార్జీలు విధించవచ్చు. సుప్రీంకోర్టు తీర్పుతో  దేశంలో లక్షలాది మంది  క్రెడిట్ కార్డు హోల్డర్లపై ప్రభావం చూపనుంది.

 క్రెడిట్ కార్డు వడ్డీ రేట్లను ఏటా 30 శాతం పరిమితితో బ్యాంకులకు నష్టం వాటిల్లుతుందని కొన్ని బ్యాంకులు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, సిటీ బ్యాంక్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, హాంకాంగ్, షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ (HSBC) సహా బ్యాంకులు న్యాయమూర్తులు బేలా త్రివేది, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ముందు పిటిషన్లు దాఖలు చేశాయి. 

ALSO READ | Gold Rates: గోల్డ్ ప్రియులకు షాక్.. వరుసగా మూడు రోజులు తగ్గి.. ఒక్కసారిగా పెరగిన బంగారం ధరలు

2008లో NCDRC ఆలస్యపు క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై సంవత్సరానికి 30శాతం కంటే ఎక్కువ వడ్డీ రేట్లను వసూలు చేయడం అన్యాయమని వాదించింది. మొత్తం చెల్లింపును సకాలంలో చేయనందుకు లేదా కేవలం బకాయి ఉన్న కనీస మొత్తాన్ని చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. 

విచారణ చేపట్టి సుప్రీంకోర్టు.. ఆలస్యమైన క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై సుప్రీంకోర్టు 30శాతం  పరిమితిని ఎత్తివేసింది.. 25 మార్చి 2008 నాటి NCDRC ఉత్తర్వును రద్దు చేస్తూ సుప్రీం కోర్ట్ తీర్పు చెప్పింది. దీంతో బ్యాంకులు మార్కెట్ పరిస్థితులకు తగినట్లుగా క్రెడిట్ కార్డు వడ్డీ రేట్లను నిర్ణయించవచ్చు. 

సుప్రీంకోర్టు తీర్పులు క్రెడిట్ కార్డు హోల్డర్లు జాగ్రత్త పడక తప్పదు.. అధిక వడ్డీ రేట్లు పడకుండా ఉండాలంటే.. క్రెడిట్ కార్డ్ చెల్లింపులు సకాలంలో చేయడం చాలా కీలకం. వడ్డీ లేని వ్యవధిలోపు నిల్వలు చెల్లించాలని నిపుణులు కార్డుదారులకు సూచిస్తున్నారు.