Money Money : పర్సనల్ లోన్లపై ఏయే బ్యాంక్ ఎంత వడ్డీ వసూలు చేస్తుందో తెలుసుకుందామా..!

పర్సనల్ లోన్.. ఈ రోజుల్లో లోన్ తీసుకోనివారు లేరు అనటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఒకరకంగా చెప్పాలంటే.. తీసుకున్న లోన్ ఈఎంఐ కట్టడం కోసమే ఉద్యోగాలు చేస్తున్నవారు చాలామంది ఉన్నారు. నిమిషాల్లో అయిపోయే ప్రాసెస్, పేపర్ లెస్ వర్క్ అంటూ ఫోన్ల మీద ఫోన్లు చేసి లోన్లు అఫర్ చేస్తున్నాయి బ్యాంకులు. అయితే, లోన్ తీసుకోవాలనుకునే వారు ఏ బ్యాంకు ఎంత వడ్డీకి లోన్ ఇస్తోంది.. ప్రాసెసింగ్ ఫీజ్ ఎంత... వంటి వివరాలు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని.. ఏది బెస్ట్ అనిపిస్తే ఆ బ్యాంకు నుండి లోన్ తీసుకోవటం మంచిది.

ALSO READ : ఓలా కుయ్యోమొర్రో : ఓలా కంపెనీలో 500 మంది ఉద్యోగులు ఔట్

బ్యాంకులు వసూలు చేసే ఇంట్రస్ట్ రేట్ కి, నాన్ బ్యాంకింగ్ సంస్థలు వసూలు చేసే ఇంట్రస్ట్ రేట్ కి చాలా తేడా ఉంటుంది. లోన్ యొక్క టెన్యూర్ ని బట్టి కూడా ఈఎంఐ అమౌంట్ అనేది నిర్ణయించబడుతుంది. ఇప్పుడు వివిధ బ్యాంకులు పర్సనల్ లోన్స్ ఎంత ఇంట్రస్ట్ రేట్ కి ఇస్తున్నాయో తెలుసుకుందాం..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ): లార్జెస్ట్ లోన్ లెండర్ అయిన ఎస్బీఐ 12.60 శాతం నుండి 14.60 శాతం వడ్డీతో పర్సనల్ లోన్స్ ఇస్తోంది.. అదే ఎస్బీఐలో సాలరీ అకౌంట్ కలిగి ఉంటే.. 11.45 శాతం నుండి 11.95 శాతం వడ్డీకి పర్సనల్ లోన్ ఇస్తోంది ఎస్బీఐ.

హెచ్ డీ ఎఫ్ సీ ( HDFC ): ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ లో లార్జెస్ట్ లెండర్ అయిన హెచ్ డీ ఎఫ్ సీ పర్సనల్ లోన్స్ మీద 10.85 శాతం నుండి 24 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తుంది. లోన్‌పై ప్రాసెసింగ్ ఛార్జీలు ₹6,500 మరియు దానిపై జీఎస్టీ అదనంగా వసూలు చేస్తోంది.

ఐసీఐసీఐ బ్యాంక్ ( ICICI ): ఐసీఐసీఐలో 10.85 నుండి 16.25 శాతం వరకు వడ్డీతో పర్సనల్ లోన్ ఇస్తున్నారు.

ఫెడరల్ బ్యాంక్: ఫెడరల్ బ్యాంక్ లో పర్సనల్ లోన్ తీసుకోవాలంటే..  11.49 నుండి 14.49 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

కోటక్ మహీంద్రా బ్యాంక్: కోటక్ మహీంద్రా బ్యాంక్ లో పర్సనల్ లోన్ పై 10.99 శాతం నుండి 16.99 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB): పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో పర్సనల్ లోన్ పై 12.5 నుండి 14.50 శాతం వరకు వడ్డీ ఉంటుంది.

యాక్సిస్ బ్యాంక్: యాక్సిస్ బ్యాంక్ లో పర్సనల్ లోన్ పై 10.49 నుండి 22.50 శాతం వరకు వడ్డీ ఉంటుంది.