బెల్లంపల్లి ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే గడ్డం వినోద్​

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో  తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమం వైభవంగా జరిగింది. కాంగ్రెస్​ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్​ జాతీయ జెండాను ఆవిష్కరించి .. గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.  తెలంగాణ విమోచన దినోత్సవాన్ని..  తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలనా దినోత్సవంగా జరుపుకోవడం గొప్ప విషయమన్నారు.  తెలంగాణ విమోచన  దినోత్సవం స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్రం సాధించామన్నారు. నిజాం పరిపాలనను అంతమొందించేందుకు అనేక మంది ప్రాణ త్యాగం చేశారని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.