బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి రూ .430 కోట్ల తో ప్రణాళికను తయారు చేసినట్లు ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్ అన్నారు. ఈ రోజు ( ఆగస్టు 19) బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఆయన సతీమణి రమాదేవితో లిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లిలో ఆర్టీసీ బస్ డిపో, ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేస్తానంటూ.. ఎల్లంపల్లి రక్షిత నీటి పథకాన్ని పునరుద్దరించి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు.
బెల్లంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామని ఇప్పటికే సర్వేపనులు మొదలు పెట్టామన్నారు. రోడ్లు, డ్రైనేజీల రూప కల్పనకు రూ. 24 కోట్ల రూపాయిల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని రూరల్గ్రామాల్లో మంచినీటి సమస్య పరిష్కారానికి రూ. 105 కోట్ల నిధులను కేటాయించామన్నారు. పాఠశాలల అభివృద్దికి.. మరుగుదొడ్ల నిర్మాణానికి రూ, 2 కోట్లను కేటాయించామన్నారు. నియోజకవర్గంలో రూ. 65.6 కోట్లతో 294 మంది సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేశామన్నారు. అలానే 925 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు అందజేశామని ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్ తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నియామకం, ఆసుపత్రిలో రోగులకు అన్ని రకాల వైద్య సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర వైద్యాశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో చర్చించామన్నారు. త్వరలో ఆస్పత్రిలో సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఇంకా బెల్లంపల్లి నుండి బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు నిర్మాణం చేసే విధంగా ప్రత్యేకంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తాను క్యాంపు ఆఫీసులో ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు.