బెల్లంపల్లి/బెల్లంపల్లి రూరల్, వెలుగు: పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి అన్నారు. బుధవారం బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్లో మహాలక్ష్మి పథకం కింద మంజూరైన గ్యాస్ సబ్సిడీ పత్రాలను చైర్ పర్సన్ జక్కుల శ్వేతతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు చేపడుతామని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని తెలిపారు.
గృహ జ్యోతి పథకంలో ప్రతి మహిళకు రూ.500 కే గ్యాస్ అందిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు బండి ప్రభాకర్ యాదవ్, గోషిక రమేశ్, గెల్లి జయరాం యాదవ్, రవి తదితరులు పాల్గొన్నారు. నెన్నెల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో అభయహస్తం, వంటగ్యాస్ సబ్సిడీ మంజూరు పత్రాలను అబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. మదర్ ప్రతిభ స్వచ్ఛంద సంస్థ ద్వారా శిక్షణ పొందిన మహిళలకు సబ్సిడీ ఉచిత కుట్టు మెషీన్లను పంపిణీ చేశారు.
కాంగ్రెస్లో చేరికలువేమనపల్లి మాజీ ఎంపీపీ కుర్రు వెంకటేశం సహా దాదాపు వంద మంది బీఆర్ఎస్ కార్యకర్తలు మంగళవారం ఎమ్మెల్యే వినోద్సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల మాజీ జడ్పీటీసీ సంతోష్ కుమార్, కాంగ్రెస్ మండలఅధ్యక్షుడు సాబీర్అలీ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.