బెల్లంపల్లి రూరల్, వెలుగు: స్వయం సహాయక సంఘాల్లోని ప్రతి మహిళా వ్యాపార రంగంలో రాణించి ఆర్థికాభివృద్ధి చెందాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్అన్నారు. నెన్నెల మండల కేంద్రంలో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ పనిముట్ల విక్రయ దుకాణం, మెడికల్షాప్ను శుక్రవారం కలెక్టర్కుమార్దీపక్, డీఆర్డీవో కిషన్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెట్టుబడులు లేక గ్రామీణ ప్రాంతంలోని మహిళలు వ్యాపారాలు చేయడం లేదని వారంతా సెర్ప్ ద్వారా ప్రభుత్వ పథకాలను, ప్రోత్సహకాలను ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలన్నారు. అనంతరం చిత్తాపూర్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
రైతులు దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి గిట్టుబాటు ధర పొందాలన్నారు. నందులపల్లి, గన్పూర్, గంగారాం ప్రాథమిక పాఠశాలల్లో రూ.30 లక్షల నిధులతో చేపట్టబోయే ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆవుడం గ్రామంలో రూ.4 లక్షల ఎస్డీఎఫ్నిధులతో చేపట్టబోయే సైడ్డ్రైన్పనులకు భూమి పూజ చేశారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్నాయకులు గట్టు మల్లేశ్, హరీశ్‌గౌడ్, మల్లాగౌడ్, తోట శ్రీనివాస్, మొహిద్‌ఖాన్, ఎంపీడీఓ దేవేందర్‌రెడ్డి, ఏపీఎం విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.