బెల్లంపల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రత్యేక పూజలు..

బెల్లంపల్లి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే గడ్డం వినోద్.  వినాయక చవితి సంధర్భంగా కార్యాలయంలో  ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే.ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజవర్గ ప్రజలందరికి వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. 

ప్రజలందరూ సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి ,సోనియాగాంధీ ఆశీర్వాదం తో  బెల్లంపల్లి నియోజవర్గాని అభివృద్ధి చెందుతుందని అన్నారు ఎమ్మెల్యే గడ్డం వినోద్.

Also Read : వినాయక చవితి స్పెషల్