బెల్లంపల్లిలో పోలీసుల ఫ్రెండ్లీ క్రికెట్

బెల్లంపల్లి, వెలుగు: నిత్యం విధుల్లో బిజిబిజీగా ఉండే పోలీసులు ఆటలు ఆడడంతో మానసిక ఒత్తిడి దూరమవుతుందని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అన్నారు. ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ క్రీడా మైదానంలో ఏసీపీ ఆధ్వర్యంలో సబ్ డివిజన్ స్థాయి పోలీసులకు ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో మందమర్రి వారియర్స్, బెల్లంపల్లి టౌన్ హంటర్స్, తాండూరు పాంథర్స్, బెల్లం పల్లి రూరల్ లెజెండ్స్ జట్లు పాల్గొన్నాయి.

ఫైనల్ లో బెల్లంపల్లి రూరల్ లెజెండ్స్ పై తాండూరు పాంథర్స్ గెలుపొందింది. విజేతలకు ఏసీపీ రవికుమార్ బహుమ తులు అందజేశారు. కార్యక్రమంలో సీఐలు అఫ్జలుద్దిన్, కుమారస్వామి, శశిధర్ రెడ్డి, దేవయ్య సబ్ డివిజన్ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.