బజార్​హత్నూర్ లో  బతుకమ్మ వేడుకలు

బజార్ హత్నూర్, వెలుగు: బజార్ హత్నూర్ మండల కేంద్రంలోని కురుక్షేత్ర స్కూల్ లో మంగళవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.  రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చి, గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విద్యార్థులు బతుకమ్మ పాటలకు డ్యాన్సులతో హోరెత్తించారు. కార్యక్రమంలో హెచ్​ఎం సబ్బిడి నవీన్, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.