బీఎన్​పీ పారిబాస్ చిల్డ్రన్స్ ఫండ్ ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు:  పిల్లల కెరీర్​ అవసరాల కోసం బ్యాంక్​ఆఫ్​ బరోడా  ప్రత్యేకంగా బీఎన్​పీ పారిబాస్ చిల్డ్రన్స్ ఫండ్​ను ప్రవేశపెట్టింది. ఈ సొల్యూషన్- ఓరియంటెడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్  డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 20 వరకు సబ్‌‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటుంది. దీనిని నిఫ్టీ 500 టోటల్ రిటర్న్ ఇండెక్స్‌‌కు బెంచ్‌‌మార్క్ చేస్తారు. 

ఫండ్​ను ప్రతీష్ కృష్ణన్ నిర్వహిస్తారు. తల్లిదండ్రులు స్టెప్-అప్ ఆప్షన్‌‌లతో కూడిన సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌‌మెంట్ ప్లాన్లతో ఇందులో పెట్టుబడి పెట్టవచ్చని, నెలవారీగా రూ. 9వేల పెట్టుబడి పెట్టడం ద్వారా  20 సంవత్సరాలలో రూ.కోటి సంపాదించవచ్చని కంపెనీ తెలిపింది. బరోడా బీఎన్​పీ పారిబాస్ చైల్డ్రన్స్ ఫండ్ పోర్ట్‌‌ఫోలియోలో కనీసం 80శాతం నికర ఆస్తులను ఈక్విటీలు,  ఈక్విటీ- సంబంధిత సెక్యూరిటీలలో పెట్టుబడి పెడుతారు.  ఈ ఓపెన్-ఎండెడ్, సొల్యూషన్ -ఓరియెంటెడ్ చైల్డ్రన్స్ స్కీమ్ ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్​తో వస్తుంది.