రైతు ఇంటిపై బ్యాంకు అధికారుల దౌర్జన్యం

బెల్లంపల్లి రూరల్, వెలుగు : బ్యాంకులో తీసుకున్న అప్పును తిరిగి కట్టాలని ఓ రైతు ఇంటిపై బ్యాంకు అధికారులు దౌర్జన్యం చేశారు. ఇంటి తలుపును తొలగించి గొడవకు దిగారు. నెన్నెల మండల కేంద్రానికి చెందిన రైతు గట్టు శివలింగయ్య రెండెకరాల సాగు భూమి కోసం 2019లో బెల్లంపల్లి కోఆపరేటివ్​బ్యాంకులో రూ.1.50 లక్షల అప్పు తీసుకున్నాడు. మూడు కిస్తీలుగా రూ.80 వేలు తిరిగి చెల్లించాడు. గతేడాది పంట నష్టాలు రావడం

 కూతురి పెండ్లి చేయడంతో మిగతా డబ్బులు చెల్లించకపోయాడు. దీంతో మిగతా డబ్బు కట్టాలని బ్యాంకు అధికారులు ఆ రైతుపై ఒత్తిడి చేస్తున్నారు. మంగళవారం శివలింగయ్య ఇంటికి చేరుకున్న అధికారులు కుటుంబసభ్యులతో గొడవపడ్డారు. దీంతో వారు తలుపులు వేసుకోవడంతో వాటిని పీకి పక్కకు పెట్టి రుణం కట్టాలని ఒత్తిడి చేశారు. బ్యాంకు అధికారుల తీరుపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు.