హైదరాబాద్, వెలుగు: సమాజంలో అశాం తిని నెలకొల్పే విధంగా ఎవ్వరు వ్యవహ రించినా వారిపై చర్యలు తీసుకో వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పోలీస్ అధికారులను ఆదేశిం చారు. మెదక్ ఘటనపై ఆదివా రం ఆయన ఆరా తీశారు. రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారు లకు ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసు కున్నారు.
పోలీసులు బాధితుల పక్షాన నిలబడుతూ, తప్పు చేసిన వారిపై చర్య లు తీసుకోవా లని ఆదేశించారు. బాధితులపై అక్రమ కేసులు పెట్టడం గానీ, అమాయకులను ఇబ్బందులకు గురిచేయొద్ద ని స్పష్టం చేశారు. మెదక్ ఘటనలో పోలీసు లు తీసుకునే చర్యల ఆధారంగానే పరిస్థితు లు చక్కబడ తాయని ఆయన వెల్లడిం చారు. శాంతి భద్రతలను కాపాడే విషయంలో ఏ ఒక్కరికీ కొమ్ముకాయ కుండా నిష్పక్ష పాతంగా వ్యవహరిం చాలని పోలీసులకు సూచించారు.
గాయపడ్డ వారికి రఘునందన్ పరామర్శ
మెదక్ లో జరిగిన అల్లర్లలో గాయపడిన వారిని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరామర్శించారు. ఆదివారం రాత్రి ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా మియాపూర్ లోని ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న గోరక్షకులను పరామర్శించారు. డాక్టర్లను అడిగిన వారి పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి మెదక్ వెళ్లిపోయారు.