న్యూఢిల్లీ: భారతీయులు వారానికి 70 గంటలు పనిచేయాలన్న ఇన్ఫోసిస్ ఫౌండర్నారాయణ మూర్తి వాదనపై అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్అదానీ స్పందించారు. వ్యక్తులు చేసే పనిలో ఆనందం పొందితేనే ‘వర్క్–లైఫ్’ బ్యాలన్స్సాధ్యపడుతుందని అన్నారు. ‘‘ మీ వర్క్-లైఫ్ బ్యాలన్స్ నాపై రుద్ద కూడదు.
నా వర్క్-లైఫ్ బ్యాలన్స్‌ను నేను మీపై రుద్దకూడదు. కొందరు కుటుంబంతో నాలుగు గంటలు గడిపి సంతోషపడతారు. కొందరు ఎనిమిది గంటలు గడుపుతారు. అది వాళ్ల బ్యాలన్స్. పనిలో నిమగ్నమైతే భార్య పారిపోతుంది”అని సరదాగా కామెంట్ చేశారు.