Bike News : బజాజ్ చేతక్ 35 సీరీస్ లాంచ్.. స్టన్నింగ్ ఫీచర్స్.. ఒక్క సారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం వెళ్తుందంటే...

మీరు నైంటీస్ కిడ్ అయితే మీకు చేతక్ అంటే వెంటనే అప్పట్లో ఓ ఊపు ఊపిన చేతక్ స్కూటర్ గుర్తొస్తుంది. అవును.. బజాజ్ చేతక్ స్కూటర్.. అప్పట్లో ఒక బ్రాండ్. డుర్ర్ర్ర్.... అంటూ ఒక డిఫరెంట్ సౌండ్ తో.. బండి వస్తుందంటేనే ‘అది పక్కా చేతక్’ అని చెప్పేలాగ ఒక యూనిక్ బ్రాండ్ క్రియేట్ చేసిన చేతక్ మళ్లీ వచ్చేస్తోంది. ఆల్ రెడీ ఇండియాలో శుక్రవారం (డిసెంబర్, 20)  లాంచ్ అయ్యింది. బజాజ్ ఆటో శుక్రవారం చేతక్ 35 సీరీస్ ను ఇండియాలో గ్రాండ్ గా లాంచ్ చేసింది.

చేతక్ 35 సీరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేరియంట్లలో లాంచ్ చేసింది కంపెనీ. 3501, 3502, 3503 వేరియంట్ల ఫుల్లీ లోడెడ్.. మోస్ట్ అవెయిటెడ్ సీరీస్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది. చేతక్ టాప్, మిడ్ వేరియంట్ల ధరను కంపెనీ అనౌన్స్ చేసింది. సీరీస్ ఎక్స్ షోరూమ్ ధరలను  టాప్ మోడల్ 3501 ప్రైస్ రూ.1.27 లక్షలు, మిడ్ వేరియంట్ 3502 ధర రూ.1.20 లక్షలుగా ప్రకటించింది. 

బజాజ్ఎలక్ట్రిక్ స్కూటర్ ను 2020 జనవరిలో లాంచ్ చేయగా ఇప్పటి వరకు 3 లక్షల స్కూటర్లు అమ్ముడుపోయాయి. ఆ క్రేజ్ ను కంటిన్యూ చేస్తూ ఇప్పుడు మోస్ట్ లోడెడ్ అప్డేటెడ్ సీరీస్ ను కస్టమర్ల కోసం తీసుకువచ్చింది బజాజ్ కంపెనీ. TVS iQube, Ather Rizta- rival లాంటి బైక్ లకు కాంపిటీటర్ గా లాంచ్ అయింది లేటెస్ట్ చేతక్.

ఇంట్రెస్టింగ్ ఫీచర్స్:

బజాజ్ స్కూటర్ డిజైన్ నుంచి రూపొందిచిన న్యూ వర్షన్ ఎలక్ట్రిక్ చేతక్ మోడల్స్ స్టన్నింగ్ ఫీచర్స్ తో ఆకట్టుకుంటున్నాయి. హెడ్ లైట్ బ్లా్క్ రౌండ్ లో స్టైలిష్ గా LED ఇచ్చారు. వీల్ బేస్ (టైర్లు) పెంచారు. అలాగే 80mm లాంగర్ సీట్ తో భలే కంఫర్ట్ గా ఇచ్చారు న్యూ స్కూటర్ ని. 

Also Read :- ఈ కార్డులకు KYC అప్ డేట్ చేసుకోండి.. లేకపోతే పని చేయవు

చేతక్ టాప్ మోడల్ 3501 లో టచ్ స్క్రీన్ TFT, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, మ్యూజిక్ కంట్రోల్, ఇంటిగ్రేటెడ్ మ్యాప్స్, జియో ఫెన్సింగ్ ఇలా అద్భుతమైన ఫీచర్స్ తో డ్రైవింగ్ కంఫర్ట్ మోడల్ గా రిలీజ్ చేశారు. ఈ ఫీచర్స్ ఇతర ఎలక్ట్రిక్ బైక్స్ తో పోల్చినపుడు చాలా బెస్ట్ అని చెబుతోంది కంపెనీ. 

బ్యాటరీ, ఛార్జింగ్, రేంజ్:

ఫ్లోర్ బోర్డ్ ఏరియాలో 3.5kW బ్యాటరీ ఇచ్చారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 153km రేంజ్ఉంటుందని క్లైమ్ చేస్తున్నారు. 950W  క్విక్ ఛార్జర్ తో 3 గంటల్లో 80 శాతం ఛార్జింగ్ చేయొచ్చు అని చెబుతున్నారు. అదేవిధంగా 4kW పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటర్ సహాయంతో 73kmph టాప్ స్పీడ్ అందుకుంటుందట. బ్రేకింగ్ సిస్టం వెరీ స్మూత్ గా ఫ్రంట్ డిస్క్, రేర్ డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. అదేవిధంగా మోనో షాక్ సెటప్ స్మూత్ డ్రైవ్ ఫీలింగ్ ఇస్తుందట. 

ఇక మిడ్ వేరియంట్ 3502 లో 5 ఇంచ్ నాన్ టచ్ స్క్రీన్ TFT (5 inch non touch screen) డిస్ప్లే ఉంటుంది. అలాగే టాప్ వేరియంట్ లో ఉన్న  క్లోజ్ డ్ గ్లోవ్ బాక్స్ కు బదులు ఓపెన్ స్టోరేజ్ కేవిటీ, ఆఫ్ బోర్డ్ ఛార్జర్ దీని స్పెషాలిటీ. 
ఇక 3503 బేసిక్ వేరియంట్ కావడం వలన ఇందులో ఫ్రంట్, బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. బేసిక్ వేరియంట్ ధర ఇంకా ప్రకటించలేదు. 

మొత్తానికి బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అప్డేటెడ్ వర్షన్స్ ను రిలీజ్ చేసింది బజాజ్. 2020లో రిలీజ్ చేసిన బేసిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అప్డేటెడ్.. టెక్ ఫీచర్స్ కలిగి ఉన్న ఈ వేరియంట్స్ కు డిమాండ్ ఎలా ఉంటుందో ఊహించవచ్చు. మీరు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటే బజాజ్ చేతక్ ను కూడా ఒకసారి ట్రయల్ వేసి చూడండి. నచ్చితే ప్రొసీడ్ అవ్వండి.