నందివాడలో విషాదం.. ఇద్దరు  పిల్లలను బావిలో పడేసి తండ్రి ఆత్మహత్య

కామారెడ్డి జిల్లా   తాడ్వాయి మండలం నందివాడలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలని బావిలో పడేసి తండ్రి శ్రీనివాస్ రెడ్డి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు, మృతులను విజ్ణేష్ (7), అనురిద్ (5)లు, శ్రీనివాస్ రెడ్డి (47) గా గుర్తించారు. 

శ్రీనివాస్ రెడ్డి మృతదేహం దొరకకపోవడంతో గజ ఈతగాళ్లు సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. కుటుంబ కలహాల వల్లే చిన్నారులతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.