బెట్టింగ్ ​ప్రాణం తీసింది..బీటెక్​ స్టూడెంట్​ ఆత్మహత్య

సదాశివపేట, వెలుగు : ఐపీఎల్​బెట్టింగ్​ఓ బీటెక్​స్టూడెంట్​ప్రాణం తీసింది. లక్షలకు లక్షలు బెట్టింగ్​పెట్టి అవి పోవడంతో శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట సీఐ మహేశ్​గౌడ్​కథనం ప్రకారం పట్టణంలోని గొల్లకేరికి చెందిన చింత ఆదర్శకుమార్​ కొడుకు వినీత్​(23) కొంతకాలంగా క్రికెట్​బెట్టింగ్​, జూదానికి అలవాటు పడ్డాడు. ఒకేసారి పెద్ద మొత్తం వస్తుందని ఆశపడి ఏకంగా రూ.25 లక్షలు అప్పు తీసుకొని ఐపీఎల్​లో బెట్టింగ్​పెట్టాడు. ఉన్న డబ్బులన్నీ పోవడంతో ఎలా కట్టాలా అని ఆవేదన చెందాడు. వేరే దారి కనిపించకపోవడంతో శని వారం ఇంట్లో కుటుంబసభ్యులు ఎవరూ లేని టైంలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తాత చింత వెంకటేశాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.