హైదరాబాద్లో ఇల్లు కట్టాలనుకుంటున్నారా..? అయితే ఈ వార్తపై లుక్కేయండి

  •  39 శాతం పెరిగిన నిర్మాణ ఖర్చు: అధికమైన మెటీరియల్స్​, లేబర్​ఖర్చులు

న్యూఢిల్లీ:మనదేశంలోని పెద్ద నగరాల్లో ఇంటి నిర్మాణ ప్రాజెక్టుల సగటు నిర్మాణ వ్యయం గత నాలుగేళ్లలో 39 శాతం పెరిగింది.  చదరపు అడుగుకు రూ. 2,780 అయింది.  బిల్డింగ్ మెటీరియల్స్,  లేబర్ ఖరీదైనవిగా మారుతున్నాయి.  

రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా డేటా ప్రకారం, ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్ట్‌‌ల సగటు నిర్మాణ వ్యయం అక్టోబర్ 2020లో చదరపు అడుగులకు రూ. 2,000గా ఉంది.  ఇది అక్టోబర్ 2021లో చదరపు అడుగుకు రూ. 2,200, అక్టోబర్ 2022లో చదరపు అడుగుకు రూ. 2,300, అక్టోబర్ 2023లో చదరపు అడుగుకు రూ. 2,500,  అక్టోబర్ 2024లో చదరపు అడుగుకు రూ. 2,780కి పెరిగింది.   

గత ఏడాది కాలంలో, ఇసుక, ఇటుక, గాజు, కలప మొదలైన నిర్మాణ సామగ్రితోపాటు కూలీల ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఇంటి నిర్మాణ ప్రాజెక్టుల సగటు వ్యయం 11 శాతం పెరిగిందని కొలియర్స్​ రిపోర్ట్​ వివరించింది.