భారీగా లోన్లు ఇచ్చిన ఆక్సీలో

హైదరాబాద్, వెలుగు:  ఎడ్యుకేషన్ ఫైనాన్స్ ఎన్‌‌బీఎఫ్‌‌సీ ఆక్సిలో ఫిన్‌‌సర్వ్ గత మూడు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ మార్కెట్ల నుంచి లోన్ల వ్యాపారాన్ని వార్షికంగా 50 శాతం పెంచుకుంది. మరింత వేగంగా  లోన్​ ప్రాసెసింగ్‌‌  చేయడానికి కంపెనీ త్వరలో తన కస్టమర్ టచ్ పాయింట్‌‌లను కీలక స్థానాల్లో ఏర్పాటు చేయనుంది. సెమీ-అర్బన్ ప్రాంతాల విద్యార్థులకు మద్దతును ఇవ్వడంపై ఫోకస్​ చేస్తున్నామని, ఇందుకోసం బ్రాంచ్ నెట్‌‌వర్క్‌‌ను విస్తరిస్తున్నామని కంపెనీ తెలిపింది. 

ఏటా దాదాపు 65 వేల మంది తెలుగు రాష్ట్రాల స్టూడెంట్లు చదువు కోసం విదేశాలకు వెళుతున్నారు. రూ. 35 లక్షల నుంచి రూ. 65 లక్షల వరకు లోన్లు తీసుకుంటున్నారని, మెజారి స్టూడెంట్లు అమెరికా, యూకే, కెనడా, ఐర్లాండ్,  ఆస్ట్రేలియా వెళ్తున్నారని ఆక్సీలో సీనియర్​ఎగ్జిక్యూటివ్​ ఒకరు చెప్పారు. వీళ్లు ఎక్కుగావ మాస్టర్ ఇన్ కంప్యూటర్ సైన్స్, మాస్టర్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వంటి కోర్సులు చదువుతున్నారు.