న్యూఢిల్లీ: క్యాన్సర్ చికిత్సలో వాడే మందును యూఎస్‌లో అమ్మడానికి అరబిందో ఫార్మా సబ్సిడరీ యూజియా ఫార్మా స్పెషాలిటీష్‌కు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతులిచ్చింది.
పాజోపనిబ్ ట్యాబ్లెట్స్ (200 ఎంజీ)ను ఈ కంపెనీ తయారు చేస్తుంది. అలానే యూఎస్ మార్కెట్‌లో అమ్ముతుంది. నోవార్టిస్ ఫార్మాకు చెందిన వొట్రియంట్ ట్యాబ్లెట్స్ (200 ఎంజీ) కు పాజోపనిబ్ ట్యాబ్లెట్స్ సిమిలర్. వచ్చే ఏడాది మార్చి క్వార్టర్‌లో ఈ క్యాన్సర్ మందును అరబిందో యూఎస్‌లో లాంచ్ చేయనుంది. ఈ కంపెనీ షేర్లు ఒక శాతం నష్టపోయి రూ.1,254.70 వద్ద ముగిశాయి.
డా.రెడ్డీస్‌పై పెనాల్టీ
తమ సబ్సిడరీపై కజకిస్తాన్ రెవెన్యూ అథారిటీ రూ.28.7 లక్షల పెనాల్టీ వేసిందని డాక్టర్ రెడ్డీస్ గురువారం పేర్కొంది. 2021లోని చేసిన కొన్ని రకాల ఖర్చులను క్లెయిమ్స్ చేసుకోవడంపై ఈ పెనాల్టీ పడింది.