ఆరిజన్ డెయిరీ ఎండీపై దాడి

 

  • బెల్లంపల్లి టౌన్ లో ఘటన 
  • ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు

బెల్లంపల్లి, వెలుగు: ఆరిజన్ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..  బెల్లంపల్లి టౌన్ బజార్ ఏరియాలోని ఓ సెలూన్ షాపు వద్ద ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఆరిజన్ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ ఆదినారాయణ తన ఫ్రెండ్ తో కలిసి ఉన్నారు. అక్కడికి వచ్చిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో ఆదినారాయణపై దాడిచేశారు. 

వెంటనే తేరుకున్న ఆయనతో పాటు  ఫ్రెండ్ వారిని నియంత్రించే ప్రయత్నం చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే ఆదినారాయణ గాయపడ్డారు. బెల్లంపల్లి ఏసీపీ ఏ. రవికుమార్ ఘటనా స్థలానికి వెళ్లారు.  గాయపడ్డ ఆదినారాయణను వన్ టౌన్ ఇన్ స్పెక్టర్ దేవయ్య ఆధ్వర్యం లో పోలీసులు బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.