జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య

ఆసిఫాబాద్/జైనూర్, వెలుగు: సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అని మాజీ జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు అన్నారు. జర్నలిస్టుపై దాడికి నిరసనగా గురువారం ఆసిఫాబాద్​ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్​లో ప్రింట్, ఎలక్ట్రానిక్​మీడియా జర్నలిస్టులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. వీరికి ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. జర్నలిస్టుపై దాడి జరగడం బాధాకరమన్నారు. 

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు భద్రత కల్పించాల న్నారు. మోహన్ బాబు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల నాయకులు రేగుంట కేశవరావు, నారాయణ, నాగరాజు, రూప్నార్ రమేశ్, దినకర్, జర్నలిస్టులు పాల్గొన్నారు. జైనూర్​లో టీయూడబ్ల్యూజే ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.