అట్రాసిటీ కేసులో నిందితులకు 14 రోజుల రిమాండ్ : ఏసీపీ మధు

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట రూరల్ మండలం సీతారాంపల్లి గ్రామంలో మూడు రోజుల కింద హనుమాన్ మాల వేసుకున్న ఎస్సీ స్వాములను గుళ్లోకి రావొద్దంటూ అడ్డుకున్న ముగ్గురు నిందితులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏసీపీ మధు తెలిపారు. ము గ్గురు నిందితులకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ను విధిస్తూ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్టేట్ కోర్ట్ జడ్జి చందన ఆర్డర్ జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.