తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో..కలసి పని చేస్తామన్న అసోచామ్

హైదరాబాద్, వెలుగు: వివిధ అంశాల్లో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి పనిచేస్తామని పరిశ్రమల సంఘం అసోచామ్ ​ప్రకటించింది. సంస్థ మొట్టమొదటి  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కౌన్సిల్ సమావేశాన్ని బుధవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించారు. అసోచామ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కౌన్సిల్ చైర్మన్,  యాక్సిస్ ఎనర్జీ గ్రూప్ సీఎండీ  రవి కుమార్ రెడ్డి సమావేశానికి అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుస్థిరత , సాధికారత, వ్యవస్థాపకత,  డిజిటలైజేషన్ వంటి కీలక రంగాల్లో అసోచామ్ తెలంగాణ,  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో కలిసి పని చేస్తుందని చెప్పారు. ఈ రాష్ట్రాలలో సామాజిక-ఆర్థిక వృద్ధిని కొనసాగించడానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.  రాష్ట్రాల వేగవంతమైన ఆర్థిక అభివృద్ధికి  రంగాల వారీగా రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  సిద్ధం చేశామన్నారు.