ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మీ హౌస్ అరెస్ట్

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మీని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వాంకిడి ఆశ్రమ పాఠశాల ఫుడ్ పాయిజన్ ఘటనలో మృతి చెందిన విద్యార్థి శైలజ ఇంటికి  వెళ్లుండగా  ఎమ్మెల్యే కోవలక్ష్మిని ఆమె  ఇంటి దగ్గర పోలీసులు అడ్డుకున్నారు.  ఎందుకు అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ కార్యకర్తలు, ఎమ్మెల్యే పోలీసులను నిలదీశారు. కాసేపు పోలీసులకు, ఎమ్మెల్యేకు మధ్య  వాగ్వాదం జరిగింది. దీంతో ఆమె తన ఇంటి ముందే బైఠాయించి నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి బాలికల ఆశ్రమ పాఠశాలల్లో అక్టోబర్ 31న ఫుడ్ పాయిజన్  జరిగి తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.. హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ  నవంబర్ 25న చనిపోయింది.