వేధింపుల కేసులో జీవిత ఖైదు

  • ఒకరికి జీవిత ఖైదు, మరొకరికి పదేండ్ల జైలు
  • అసిఫాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు 
  • జడ్జి ఎంవీ రమేశ్ తీర్పు

ఆసిఫాబాద్ ,వెలుగు : బాలికను లైంగికంగా వేధించిన కేసులో ఇద్దరు నిందితుల్లో ఒకరికి జీవితఖైదు, రూ. 15 వేల ఫైన్ , మరొకరికి పదేండ్ల జైలుశిక్ష, రూ.10 వేల ఫైన్ విధిస్తూ ఆసిఫాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ మంగళవారం తీర్పు చెప్పారు. కౌటల సీఐ రమేశ్ తెలిపిన ప్రకారం.. అసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన తాక్రే ప్రకాశ్, కామ్రే గణేశ్ అనే వ్యక్తులు లైంగికంగా వేధించారు. 2018, జనవరి 22న బాలిక ఫ్రెండ్ ఫిర్యాదుతో బెజ్జూరు పోలీసులు నిందితులు ప్రకాశ్, కామ్రే గణేశ్ పై ఫోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం ఎంక్వైరీ రిపోర్టును కోర్టులో దాఖలు చేశారు. విచారణలో భాగంగా నిందితులు ప్రకాశ్, గణేశ్ కు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు.  కేసులో నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన కాగజ్ నగర్ డీఎస్పీ రామానుజం, కౌటల సీఐ రమేశ్, బెజ్జూరు ఎస్ఐ విక్రమ్,   కోర్ట్ సిబ్బందిని ఎస్పీ డీసీ శ్రీనివాసరావు అభినందించారు.