గ్రామాల్లో పర్యటించి.. సమస్యలు తెలుసుకొని..

కాగజ్​నగర్,  వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ట్రీట్మెంట్ చేయాలని ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. బుధవారం కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి పెంచి కల్ పేట్ మండలంలోని మారుమూల కమ్మర్ గాం, మోర్లీ గూడ గ్రామాల్లో పర్యటించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ స్కూళ్ల తనిఖీ చేశారు.

వానాకాలం సీజన్ వేళ టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వ్యాధుల నమోదులో జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. మారుమూల పల్లెల్లోని ప్రజలకు వైద్య సౌకర్యాలు అందేలా రోడ్ల కోసం అటవీ శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాణహిత నది బ్యాక్ వాటర్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు వ్యవసాయ విస్తరణ అధికారులు పంట నష్టం వివరాలను సేకరించి నివేదిక అందించాలని 
ఆదేశించారు.