రెండు రోజుల్లో ప్యాడీ సెంటర్లను ఓపెన్ చేయాలి : అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ

దహెగాం, వెలుగు: రెండ్రోజుల్లో అన్ని ప్యాడీ సెంటర్లను ఓపెన్ చేయాలని ఆసిఫాబాద్​అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ ఆదేశించారు. దహెగాం మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్యాడీ సెంటర్​ను సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి బుధవారం పరిశీలించారు. రెండ్రోజుల్లో మండలంలోని అన్ని ప్యాడీ సెంటర్లను ఓపెన్ చేసి ధాన్యం కొనుగోలు చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. 

సన్నరకం, దొడ్డు రకం వరి ధాన్యానికి వేర్వేరుగా సెంటర్లు ఓపెన్ చేసి కొనుగోలు చేపట్టాలన్నారు. రైతులకు అన్నిరకాల సౌలతులు కల్పించాలన్నారు. అనంతరం స్థానిక కేజీబీవీని సందర్శించారు. స్టూడెంట్ల అటెండెన్స్, మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ఏఎస్ఓ సాదిక్, తహసీల్దార్ కవిత, ఎంపీడీఓ రాజేందర్, ఆర్ఐలు నాందేవ్, శృతి,ఎస్ కందూరి రాజు, సీఈఓ నారాయణ, స్టాఫ్ ఉన్నారు.