ఆసిఫాబాద్ ​జిల్లాలో డెంగ్యూతో ఏఎస్ఐ మృతి

కాగజ్ నగర్, వెలుగు: డెంగ్యూతో ఏఎస్ఐ మృతి చెందిన ఘటన ఆసిఫాబాద్ ​జిల్లాలో జరిగింది. సిర్పూర్ (టి)కి చెందిన గులాం మసూద్ అహ్మద్ (50) కాగజ్ నగర్ రూరల్ పీఎస్ లో ఏఎస్ ఐగా విధులు నిర్వహిస్తూ.. స్థానికంగా ఇర్ఫాన్ నగర్ లో ఉంటున్నాడు. కొన్ని రోజులుగా అతడు జ్వరంతో  బాధపడుతుండగా కుటుంబసభ్యులు ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ చేయిస్తున్నారు. 

పరిస్థితి విషమించడంతో  సోమవారం ఉదయం మరోసారి హాస్పిటల్ కు తీసుకెళ్లారు. డాక్టర్ల సూచన మేరకు మంచిర్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. మసూద్ అహ్మద్ మృతదేహానికి కాగజ్ నగర్ డీఎస్పీ రామానుజం, పొలీస్ సిబ్బంది నివాళులర్పించారు.