పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పేరు మార్చొద్దు : ఆర్యవైశ్య సంఘం

భైంసా/కుభీర్, వెలుగు: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఖ్యాతికి గుర్తుగా ఉన్న పోట్టి శ్రీరాములు తెలంగాణ తెలుగు విశ్వవిద్యాలయం పేరును అలాగే కొనసాగించాలని ఆర్యవైశ్య సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు విలాస్​ గాదేవార్ ​డిమాండ్​ చేశారు. ఇటీవల ప్రభుత్వం తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డిగా పేరు మార్చేందుకు కేబినెట్ నిర్ణయించడంపై ఆర్యవైశ్యులు గురువారం ఆందోళనకు దిగారు. భైంసాలో బైక్​ ర్యాలీ తీసి ఆర్డీవో కోమల్​రెడ్డికి వినతి పత్రం అందజేశారు.

భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీ ఏర్పాటుకు ఆమరణ నిరాహార దీక్ష చేసిన పోట్టి శ్రీరాములు పేరును మార్చడం తెలంగాణ ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతీసినట్టే అవుతుందన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రధాన కార్యదర్శి సాయినాథ్ గుజ్జుల్​వార్, పట్టణ అధ్యక్షుడు శ్రీశైలం దర్బార్, సెక్రటరీ గోపి గుజ్జుల్ వార్, సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పేరు మార్చొద్దని తెలంగాణ ఆర్యవైశ్య కుభీర్ శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ సోముకు వినతిపత్రం అందజేశారు. పేరు మార్పుపై కేబినెట్​ నిర్వయంతో ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. తెలుగు రాష్ట్రాల ఖ్యాతికి గుర్తుగా తెలుగు విశ్వవిద్యాలయం పేరును అలాగే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు.