బాసర అమ్మవారి సన్నిధిలో ఢిల్లీ పురావస్తు బృందం: ప్రొఫెసర్ మహాలక్ష్మి రామకృష్ణన్

బాసర, వెలుగు: నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రాన్ని బుధవారం ఢిల్లీకి చెందిన పురావస్తు బృందం సందర్శించారు. ఆలయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రసాద్’ పథకంలో చేర్చేందుకు గానూ ఢిల్లీకి చెందిన ప్రొఫెసర్ మహాలక్ష్మి రామకృష్ణన్ ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల బృందం ఆలయాన్ని పరిశీలించింది. అమ్మవారి చరిత్ర, ఆలయ విశిష్టతలు, అమ్మవారికి చేసే ఆచార సాంప్రదాయాలు, పూజా కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.