కొట్టుకుపోయిన అప్రోచ్ వంతెన.. నిలిచిన రాకపోకలు

కడెం, వెలుగు: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ధర్మాజీపేట నుంచి కుర్రగూడ, రేపోజిపేట గ్రామాలకు వెళ్లే మార్గమధ్యలో ఉన్న అప్రోచ్ ​వంతెన గురువారం రాత్రి కురిసిన వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో ఆ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 

ఆ గ్రామాల మధ్య ఉన్న వంతెన రెండేండ్ల క్రితం వరదలకు కొట్టుకుపోగా.. గ్రామస్తులు తాత్కాలికంగా అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేసుకొని రాకపోకలు కొనసాగిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో తాజాగా ఆ అప్రోచ్ వంతెన సైతం కొట్టుకుపోయింది. ప్రభుత్వం స్పందించి పర్మనెంట్ వంతెన నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టి పూర్తిచేయాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు.