- నిర్మల్ అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్
నిర్మల్, వెలుగు : ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి లో భాగంగా అదనపు కలెక్ట ర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ తో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులను స్వీకరించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల విభాగాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఆదిలాబాద్టౌన్, వెలుగు: జిల్లా ప్రజలు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగానికి 78 అర్జీలు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను అధికారులు వెంటనే పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వినోద్ కుమార్, జడ్పి సీఈఓ జితేందర్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.