పెద్దపల్లి లైబ్రరీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అన్నయ్య గౌడ్

సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా లైబ్రరీ సంస్థ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సుల్తానాబాద్ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేత అంతటి అన్నయ్య గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియమితులయ్యారు. శుక్రవారం ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్ఎస్ యూఐ  మండల అధ్యక్షునిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన అన్నయ్య గౌడ్ ఉమ్మడి జిల్లా డీసీసీలో వివిధ హోదాల్లో పార్టీకి  సేవలందించారు.

 ఉమ్మడి కరీంనగర్ జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా వ్యవహరించారు. తన నియామకానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్​సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు కృతజ్ఞతలు తెలిపారు.