మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేగుంట 44వ నేషనల్ హైవేపై ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి వచ్చి ఢీ కొట్టింది మరో లారి. ఈ ఘటనలో వెనుక లారీలో ఉన్న నలుగురు మృతి చెందగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. రెండు లారీలు నుజ్జనుజ్జ అయ్యాయి.
ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయాలైన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.