- రెండు నెలల్లో 5 ఘటనలు.. స్థానికుల్లో ఆందోళన
భైంసా, వెలుగు : నిర్మల్‌జిల్లా భైంసా పట్టణంలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. నిమిషాల వ్యవధిలో రెండు చోట్ల స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. రాహుల్‌నగర్‌లో సాయిరాజ్ దంపతులు కిరాణా షాపు నిర్వహిస్తుంటారు. మంగళవారం సాయిరాజ్ భార్య షాపులో ఉండగా.. ఇద్దరు వ్యక్తులు అక్కడికి వెళ్లి సిగ రెట్లు కావాలని అడిగారు. ఆమె సిగరెట్లు ఇస్తున్న క్రమంలో మెడలోని బంగారు గొలుసు లాగే ప్రయత్నం చేశారు.
అప్రమత్తమైన ఆమె గొలుసును గట్టిగా పట్టుకొని కేకలు వేయడంతో స్నాచర్లు పారిపోయారు. మరికొద్దిసేపటికే రాజీవ్‌నగర్‌కు చెందిన మంజుల అనే మహిళ చికిత్స కోసం హాస్పిటల్‌కు వెళ్తుండగా.. ఆర్డీవో ఆఫీస్సమీపంలో బైక్‌పై వచ్చిన స్నాచర్లు ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసు తెంపుకొని ఉడాయించారు. బలంగా లాగడంతో కిందపడిపోయిన బాధితురాలికి గాయాల య్యాయి.
స్థానికులు గమనించి ఆమెను ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. మంజుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు నెలల్లో భైంసాలో ఇది ఐదో స్నాచింగ్ఘటన కావడంతో స్థానిక మహిళలు భయాందోళనలకు గురవుతున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు ముమ్మరం చేశారు.