మంచిర్యాల జిల్లా యూత్ అధ్యక్షుడిగా అనిల్ రావు

నస్పూర్, వెలుగు : కాంగ్రెస్ మంచిర్యాల జిల్లా యూత్ విభాగానికి జరిగిన ఎన్నికల్లో నస్పూర్ కు చెందిన అనిల్ రావు విజయం సాధించారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పీ1 గనిలో కార్మికునిగా పనిచేస్తున్న అనిల్ రావు కాంగ్రెస్​లో చురుగ్గా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ సహకారంతో జిల్లా యూత్ అధ్యక్షుడిగా పోటీలో నిలిచారు.

ఇటీవల ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో అనిల్ రావు రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో  (17616) విజయం సాధించారు. ఈ సందర్భంగా అనిల్ రావును సీఎం రేవంత్​రెడ్డి, ఎమ్మెల్యే అభినందించారు.