ఈ వాచ్ రూ.22 కోట్లు.. భూ మండలంపై మూడు మాత్రమే.. ఒకటి అంబానీ దగ్గర

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు.. డబ్బున్న రాజులు ఏమైనా చేయగలరు అనే కంటే.. ఏమైనా సృష్టించగలరు.. అవును.. ఈ భూ మండలంపైనే.. మీరు చూస్తున్న వాచ్ లు మూడు మాత్రమే ఉన్నాయి.. అందులో ఒకటి అనంత్ అంబానీ దగ్గర ఉంది. ఇలాంటి వాచ్ ధరించాలంటే కోట్లకు కోట్లు పెట్టాలి.. అవును.. ఈ వాచ్ ధర అక్షరాల 22 కోట్ల రూపాయలు.. మీ దగ్గర ఉన్న వాచ్ లేదా సెల్ ఫోన్ లో చూపించే టైమే ఇందులోనూ చూపిస్తుంది.. కాకపోతే దానికి ఉన్న బ్రాండ్ అలాంటిది.. అనంత్ అంబానీ ధరించిన ఈ వాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ వాచ్ పేరు రిచర్డ్ మిల్లీ RM 52..04 స్కల్.. నీలం రంగులో ఉంది. ప్రపంచలోనే అరుదైన టైం పీస్ లలో ఒకటి ఇది. ఈ స్కల్ గడియారాలు ఎక్కడపడితే అక్కడ దొరకవు.. ఎవరు పడితే వాళ్లకు అమ్మరంట.. ఈ వాచ్ కొనుగోలు చేయాలన్నా.. ఆయా వ్యక్తులకు స్టేటస్ ఉండాలంట.. రిచర్డ్ మిల్లీ RM 52..04 స్కల్ చేతి గడియాలను ప్రత్యేకమైన క్లయింట్స్ కోసం మాత్రమే తయారు చేస్తారు.. ఇప్పటి వరకు మూడు మాత్రమే తయారు చేయగా.. అందులో ఒకటి అనంత్ అంబానీ దగ్గర ఉంది. దీని ధర 22 కోట్ల రూపాయలు. 

ఇక అనంత్ అంబానీ వాచ్ కలెక్షన్స్ కొత్తేమీ కాదు.. గతంలోనూ చాలా ఖరీదైన వాచ్ లు కొనుగోలు చేశాడు. మొత్తంగా 200 కోట్ల రూపాయల విలువైన వాచ్ లు అనంత్ అంబానీ దగ్గర ఉన్నాయి. 2024లో రిచర్డ్ మిల్లీ వాచ్ కొనుగోలుతో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఇక్కడ అంబానీ ఈ వాచ్ ధరించటం ఓ అంశం అయితే.. ఈ రిచర్డ్ మిల్లీ వాచ్ కంపెనీ.. ఇలాంటి వాచ్ లను సెలక్టెడ్ పీపుల్స్ కు మాత్రమే అమ్మటం కూడా ఓ విశేషం. డబ్బులు ఇస్తామంటే ఎవరికి పడితే వాళ్లకు ఇలాంటి వాచ్ లు తయారు చేయరంట.. అమ్మరంట.. అంటే డబ్బున్నా ఆ మనిషి స్టేటస్ కూడా ముఖ్యం అంట..