ఆదిలాబాద్ జిల్లా : బేల మండలం సైదాపూర్ లో సోమవారం దారుణం చోటుచేసుకుంది. భార్యాభర్తల గొడవల కారణంగా భార్య సునీత గొంతుకోసి భర్త లస్మన్న హత్య చేశాడు. తరువాత తన గొంతుకోసుకుని భర్త లస్మన్న ఆత్మహత్య చేసుకున్నాడు. పదేళ్ల క్రితం వీరు ప్రేమపెళ్లి చేసుకున్నారు. సునీత లస్మన్న లకు ఇద్దరు సంతానం ఉన్నారు. భార్యపై అనుమానంతో గత కొంతకాలంగా తరచూ వీరి మధ్య మనస్పర్ధలు, గొడవలు జరిగుతున్నాయి. జూలై 15న లస్మన్న ఈ ఘటనకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ | బెట్టింగ్ యాప్ అరాచకం : రైలు కింద పడి రైల్వే ఉద్యోగి ఆత్మహత్య