యాంపివో టికెట్​ బుకింగ్ సేవలు ప్రారంభం

హైదరాబాద్: హెల్త్ టెక్, టెలిమెడిసిన్,  గృహోపకరణాలలో స్మార్ట్ సొల్యూషన్స్‌‌‌‌‌‌‌‌ అందించే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన యాంపివో స్మార్ట్ టెక్నాలజీస్ రూరల్​ ట్రేడ్, డిజిటల్ టిక్కెట్ బుకింగ్ సేవలను ప్రారంభించినట్టు ప్రకటించింది.

 యూజర్ల అవసరాలను తీర్చడానికి డిజిటల్, ఫిజికల్​సొల్యూషన్స్​ అందిస్తామని తెలిపింది. రాబోయే ఆర్నెళ్లలో ప్రయోగాత్మకంగా సేవలు అందిస్తారు. 15 నెలల్లో పూర్తిస్థాయి కార్యకలాపాలు మొదలుపెడతారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు టికెట్లను అందించడానికి, ఉత్పత్తుల కొనుగోలు కోసం యాప్​ను అందుబాటులోకి తెస్తామని యాంపివో  ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సాయినాథ్ రెడ్డి అన్నారు.