షాపర్స్ స్టాప్‌‌‌‌‌‌‌‌లో వాటాలు అమ్మిన అమెజాన్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ : డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ స్టోర్లను నిర్వహించే షాపర్స్ స్టాప్‌‌‌‌‌‌‌‌లో 4 శాతం వాటాను రూ.276 కోట్లకు అమెజాన్ విక్రయించింది. సబ్సిడరీ కంపెనీ  అమెజాన్ డాట్‌‌‌‌‌‌‌‌ కామ్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌వీ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ హోల్డింగ్స్‌‌‌‌‌‌‌‌ ద్వారా షాపర్స్‌‌‌‌‌‌‌‌ స్టాప్‌‌‌‌‌‌‌‌కి చెందిన 44 లక్షల షేర్లను అమ్మామని  పేర్కొంది. ఓపెన్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో ఈ డీల్ పూర్తయ్యింది. ఒక్కో షేరుని రూ.627.60 కి  అమ్మింది. 

వెల్త్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ కంపెనీ 360 వన్  తన అనుబంధ కంపెనీలు ద్వారా షాపర్స్ స్టాప్‌‌‌‌‌‌‌‌లోని వాటాలను కొనుగోలు చేసింది. కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్‌‌‌‌‌‌‌‌, టాటా ఎంఎఫ్‌‌‌‌‌‌‌‌, మోర్గాన్ స్టాన్లీ కూడా షాపర్స్‌‌‌‌‌‌‌‌ స్టాప్‌‌‌‌‌‌‌‌లో వాటాలను కొన్నాయి. షాపర్స్ స్టాప్‌‌‌‌‌‌‌‌ షేర్లు బుధవారం  ఒక శాతానికి పైగా లాభపడి రూ.635 వద్ద ముగిశాయి.