జనవరి 3నుంచి అమెజాన్​హోం షాపింగ్ స్ప్రీ

హైదరాబాద్​, వెలుగు: ప్రముఖ ఈ–కామర్స్​ప్లాట్​ఫామ్​అమెజాన్​వచ్చే నెల 3–7 తేదీల్లో హోం షాపింగ్ స్ప్రీ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా వాటర్ హీటర్లు, కిచెన్ వస్తువులు, ఫర్నీచర్ వంటి ప్రొడక్టులపై ఆఫర్లు ఇస్తామని ప్రకటించింది. ఓరియెంట్, హావెల్స్, బాష్, లైఫ్ లాంగ్ వంటి బ్రాండ్ల ప్రొడక్టులను తగ్గింపు ధరలకు పొందవచ్చని పేర్కొంది. చాలా ప్రొడక్టులపై డీల్స్​ఉంటాయని, కనీసం 40 శాతం డిస్కౌంట్​ఉంటుందని తెలిపింది. ప్రొడక్టులను వేగంగా డెలివరీ ఇస్తామని, కొన్ని కార్డులతో కొంటే క్యాష్​బ్యాక్స్ పొందవచ్చని అమెజాన్​ పేర్కొంది.