క్విక్‌‌కామర్స్‌‌లోకి అమెజాన్‌‌!

న్యూఢిల్లీ : క్విక్‌‌కామర్స్ ఇండస్ట్రీ విస్తరిస్తుండడంతో అమెజాన్‌‌ కూడా ఈ సెగ్మెంట్‌‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. అమెజాన్ ఇండియా  ఉద్యోగులను హైర్ చేసుకుంటోందని, ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది జనవరిలో  టెజ్‌‌ పేరుతో క్విక్‌‌కామర్స్ సర్వీస్‌‌లను లాంచ్ చేయనుందని ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ చేసింది.  ప్రస్తుతం జెప్టో, జొమాటో బ్లింకిట్‌‌, స్విగ్గీ ఇన్‌‌స్టామార్ట్‌‌  ఈ ఇండస్ట్రీలో టాప్‌‌ కంపెనీలుగా కొనసాగుతున్నాయి. 

ఒక్క నవంబర్‌‌‌‌లోనే సుమారు రూ.50 వేల కోట్ల విలువైన సేల్స్‌‌ను ఇవి జరిపాయని అంచనా. వచ్చే నెల మొదటి వారంలో  జరిగే సంభవ్‌‌ ఈవెంట్‌‌లో  అమెజాన్ కొత్త బిజినెస్‌‌పై  క్లారిటీ రానుంది. అమెజాన్ ఏ దేశంలోనూ క్విక్‌‌కామర్స్ సెగ్మెంట్‌‌లోకి ఎంటర్ అవ్వలేదు.  ఫెస్టివల్ సీజన్‌‌కు ముందే ఫ్లిప్‌‌కార్ట్ మినిట్స్ బ్రాండ్‌‌తో  ఈ సెగ్మెంట్‌‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ బిజినెస్‌‌ను విస్తరిస్తోంది.