ఐక్య పోరాటాలతో హక్కులను సాధించుకుందాం : అల్లం నారాయణ

  • టీయూడబ్ల్యూ జే (హెచ్ -143) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ 

ఆసిఫాబాద్, వెలుగు : ఐక్య పోరాటాలతో జర్నలిస్టుల హక్కులను సాధించుకుందామని టీయూడబ్ల్యూజే (హెచ్–143) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ అన్నారు. ఆదివారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్​లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. సంఘం బలోపేతానికి మండల స్థాయి నుంచి జిల్లాస్థాయి దాకా కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. జర్నలిస్టులు సభ్యత్వ నమోదులో ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో  రాష్ట్ర కార్యదర్శి మారుతి సాగర్, ఎలక్ట్రానిక్  మీడియా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా కన్వీనర్ రవి నాయక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాడి హనుమయ్య, యోగానంద స్వామి, యూనియన్ నేతలు ధీకొండ సతీశ్ తదితరులు పాల్గొన్నారు.