అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి : అఖిలపక్ష నాయకుల

  • ఇచ్చోడలో అఖిలపక్ష నాయకుల డిమాండ్

ఇచ్చోడ, వెలుగు : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఇచ్చోడలో   రాజకీయ పార్టీ, దళిత గిరిజన బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీలో వారు మాట్లాడారు.  నిర్మల్ బైపాస్ రోడ్డు  నుంచి అంబేద్కర్ చిత్రపటాలతో  ర్యాలీ నిర్వహించి,  అంబేద్కర్ చౌక్ లో అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేశారు. రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా బీజేపీ వ్యవహరిస్తుందని,  400 ఎంపీ సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చేసే కుట్ర పన్నారని వారు  ఆరోపించారు.  

అమిత్ షా పార్లమెంట్​లో మాట్లాడే స్వేచ్ఛ   అంబేద్కరే  ఇచ్చాడని గుర్తుంచుకోవాలని అన్నారు. మరోసారి అంబేద్కర్ పై   విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.   ఈ కార్యక్రమంలో  మార్కెట్ కమిటీ చైర్మన్ కుమరం కోటేశ్వర్, ధర్మ సమాజ్​ పార్టీ రాష్ట్ర కార్యదర్శి  అన్నెల లక్ష్మణ్, ఇచ్చోడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహిముద్ ఖాన్, నారాయణరెడ్డి ధర్మపాల్, సాబేర్, పొనగంటి ఆశన్న, లస్మన్న,  దుబ్బాక చందు, బొజ్జ రవి,బొజ్జ లక్ష్మణ్, బత్తుల ఊషన్న,  ముస్తాపా,కొత్తూరి లక్ష్మణ్, స్వామి   పాల్గొన్నారు.