కాత్లే శ్రీధర్, ఆనంద్ కు అఖండ అవార్డు

ఇచ్చోడ, వెలుగు: ఇచ్చోడ మండలంలోని దుబార్ పేట్ కు చెందిన ప్రముఖ ఆదివాసీ కళాకారుడు, ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘం డైరెక్టర్ కాత్లే శ్రీధర్​తోపాటు కార్యదర్శి కాత్లే ఆనంద్​కు అఖండ నేషనల్ నంది అవార్డు దక్కింది. సోమవారం హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో మోర్డ్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డులు అందుకు న్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. తాము చేసిన కళా ప్రదర్శనలు, సేవా కార్యక్రమాలను గుర్తించి అవార్డు అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు.