ట్రాన్స్​ఫర్లు, ప్రమోషన్ల షెడ్యూల్ ఇవ్వాలి

  • ఏఐఎస్టీఎఫ్​ జాతీయ ప్రధాన కార్యదర్శి సదానంద గౌడ్ 

మెదక్, వెలుగు : టీచర్ల ట్రాన్స్​ఫర్లు, ప్రమోషన్ల షెడ్యూల్ ను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్టీఎఫ్​ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానంద గౌడ్​డిమాండ్​ చేశారు. ఎస్టీయూ టీఎస్​ మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక  ప్రభుత్వ బాలుర ఉన్నత స్కూల్​లో నిర్వహించిన శిక్షణ శిబిరానికి హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ఎన్నికల మేనిఫేస్టోలో పేర్కొన్న విధంగా సీపీఎస్​ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. లేనట్లయితే జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామన్నారు.

పీఆర్సీ నివేదిక తెప్పించుకొని 40 శాతం  ఫిట్మెంట్ ప్రకటించి 1.7.2023 నుంచి ఆర్థిక ప్రయోజనం పొందే విధంగా చూడాలన్నారు.  జూనియర్ కాలేజ్,  డైట్ కాలేజ్​లెక్చరర్స్ గా టీచర్స్​కు ప్రమోషన్స్ ఇవ్వాలన్నారు. రాష్ట్ర అడిషనల్​ప్రధాన కార్యదర్శి సుధాకర్ లీవ్ రూల్స్, సీసీఏ రూల్స్ పై  అవగాహన కల్పించారు. సీనియర్​ నాయకుడు గణేశ్ పెన్షన్ రూల్స్ గురంచి అవగాహన కల్పించారు.

రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సాబెర్​అలీ, మెదక్ జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్ గౌడ్,  ప్రధాన కార్యదర్శి పోచయ్య, రాష్ట్ర బాధ్యులు రాజు, జిల్లా బాధ్యులు భూపతి గౌడ్, అశోక్, కిష్టయ్య, అరుణ్ పాల్గొన్నారు.