ఫైర్​ఫ్లోలో వాటాలు అమ్మిన ఎయిర్​టెల్, వొడాఫోన్

న్యూఢిల్లీ: వై–ఫై ఇన్​ఫ్రాస్ట్రక్చర్​కంపెనీ ఫైర్​ఫ్లైలో తమ వాటాలను ఐబస్​నెట్​వర్క్​కు అమ్మినట్టు టెలికం ఆపరేటర్లు ఎయిర్​టెల్​, వొడాఫోన్​ఐడియా (వీఐ) ప్రకటించాయి. ఈ డీల్​విలువ రూ.తొమ్మిది కోట్లు. ఎయిర్​టెల్​, వొడాఫోన్​ఐడియా.. ఫైర్​ఫ్లైతో కలిసి 50–50 జాయింట్​వెంచర్​ను ఏర్పాటు చేశాయి. 

షేర్​పర్చేజింగ్​ఒప్పందం పూర్తి కావడానికి 30 రోజులు పడుతుందని భావిస్తున్నారు. వాటా అమ్మకం ద్వారా తమకు రూ.4.5 కోట్లు వచ్చాయని వీఐ తెలిపింది. విద్యాసంస్థలు, ఆస్పత్రులు, మాల్స్​, కేఫ్స్​వంటివాటికి ఫైర్​ఫ్లై వై–ఫై హాట్​స్పాట్లు ఇస్తుంది.